Sole proprietorship లేదా Proprietorship FIRM బిజినెస్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉంటుంది

బిజినెస్ ప్రారంభించే వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రారంభించే బిజినెస్ కు తగినట్లు మనకు వివిధ రకాల రిజిస్ట్రేషన్ లు ఉన్నాయి. ఏ రిజిస్ట్రేషన్ మనం చేయబోయే కంపెనీ కి సరిపడుతుందో తెలుసుకున్నాము.

బిజినెస్ ప్రారంభించే వారు తెలుసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ లు ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ ఆర్టికల్ లో Sole Proprietorship registration Process గురించి తెలుసుకొందాము.

Sole Proprietorship registration వలన లాభ నష్టాలు:

  • ఒక వ్యక్తి తన సొంత పేరుతోనే బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలంటే Sole Proprietorship ని ఎంచుకోవచ్చు.
  • ఇంటిదగ్గరే ఉంటూ చిన్న బిజినెస్ లు చేసుకొనే వారికి ఇది Sole Proprietorship ఉపయోగం గా ఉంటుంది.
  • తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బిజినెస్ ఆపేయాలి అనుకున్నప్పుడు process చాల సులువుగా ఉంటుంది.
  • Sole Proprietorship కు కంపెనీ కి ఉన్న విలువ ఉండదు.
  • దీనిలో బిజినెస్ సంబంధించిన ఆస్తులు , సొంత ఆస్తులు అనేది విడిగా ఉండవు. ఒక వేళ నష్టాలు వచ్చినా పర్సనల్ ఆస్తులకు కూడా నష్టం జరుగుతుంది.
  • Legal గ విలువ ఉండదు కనుక ,బిజినెస్ development కోసం investment బయటనుండి వచ్చే అవకాశం లేదు. భవిష్యత్ లో Partner లు మీ బిజినెస్ లోకి చేర్చుకునే అవకాశం లేదు.
  • ఇది కేవలం Tax లకు మాత్రమే ఉపయోగపడుతుంది.
  • Annual Turnover 20 లక్షల కంటే ఎక్కువ వచ్చినప్పుడు GST Pay చేయవలసి ఉంటుంది.

Sole Proprietorship registration కు కావలసిన Documents :

  • బిజినెస్ లైసెన్స్ ( మున్సిపాలిటీ నుండి permission)
  • PAN card , Identitity proof ( ఆధార్ కార్డు / Passport )
  • కంపెనీ అడ్రస్ ప్రూఫ్ ( Rent అడ్రస్ అయితే Rent అగ్గ్రెమెంట్ మరియు NOC )

Sole Proprietorship Current ఎకౌంటు Open చేయాలంటే కావలసిన Documents :

  • PAN card , Identitity proof ( ఆధార్ కార్డు  / Passport )
  • కంపెనీ అడ్రస్ ప్రూఫ్
  • సర్వీస్ టాక్స్ రిజిస్ట్రేషన్ లేదా VAT సర్టిఫికేట్ లేదా సేల్స్ టాక్స్ రిజిస్ట్రేషన్

 

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment