Startup బిజినెస్ కు వెబ్ సైట్ ఎంత అవసరమో తెలుసా ?

మీరు బిజినెస్ చేస్తున్నారా ? మీ బిజినెస్ సంబంధించి వివరాలతో వెబ్ సైట్ ఉందా ? నా బిజినెస్ కు వెబ్ సైట్ లేదు అనేది మీ సమాధానం అయితే , ఈ ఆర్టికల్ తప్పకుండా చదవండి.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సమాచారం కోసం చేతిలో వున్న స్మార్ట్ మొబైల్ ను ఓపెన్ చేసి , వెంటనే ఏదో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి తమకు కావలసిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ ఉంటారు.బిజినెస్ గురించి సమాచారం కూడా బిజినెస్ చేసేవారు లేదా కస్టమర్ లు వెబ్ సైట్ లలోనే తమకు కావలసిన బిజినెస్ లేదా ప్రోడక్ట్ ల సమాచారం వెతుకుతూ ఉంటారు. 

చేసే బిజినెస్ చిన్నదైనా  ,పెద్ద బిజినెస్ అయినా ఈ రోజుల్లో బిజినెస్ కు వెబ్ సైట్ తప్పని సరిగా ఉంటే , బిజినెస్ కు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎలా అనేదే గా మీ ప్రశ్న ? బిజినెస్ కు వెబ్ సైటు ఉండటం వలన లాభాలేంటి ? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బిజినెస్ కోసం వెబ్ సైట్ ఉండడం వలన కొన్ని ఉపయోగాలు ఏంటంటే …

  • ఒక బిజినెస్ కు వెబ్ సైట్ ఉండటం వలన కంపెనీ పట్ల కస్టమర్ కు , విశ్వసనీయత , నమ్మకం అనేది కల్పించవచ్చు.
  • ఆన్ లైన్ లో బిజినెస్ సంబంధిత వివరాల కోసం వెతికే కస్టమర్‌లకు మీ కంపెనీ ప్రోడక్ట్ ల గురించి అవగాహన కలిగేలా చేస్తుంది , తద్వారా  బిజినెస్ అభివృద్ది అవకాశాలు కల్పిస్తుంది.
  • మీకు , మీ కస్టమర్ కు ఆన్ లైన్ Relationship Maintain చేసే అవకాశాలు ఉంటాయి.
  • ఆన్ లైన్ లో వెబ్ సైట్ వుండటం వలన కంపెనీ బ్రాండ్ అనేది , ఎక్కువ మందికి తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • బిజినెస్ ఆన్ లైన్ లో మార్కెటింగ్ చేసుకునేందుకు వెబ్ సైటు చాలా ఉపయోగపడుతుంది.
  • ఆన్ లైన్ లో మార్కెటింగ్ వలన కంపెనీ కి మార్కెటింగ్ కు అయ్యే ఖర్చుకూడా తక్కువ ఉంటుంది.
  • కంపెనీ గురించి సమాచారం , మీ ప్రోడక్ట్ ల గురించి వివరాలు వెబ్ సైట్ లో ఉంచడం వలన , కంపెనీ పై కస్టమర్ కి నమ్మకం కుదిరేలా చేసి బిజినెస్ అభివృద్ది అయ్యేందుకు సహాయపడుతుంది.
  • వెబ్ సైట్ లేకపోవడం వలన బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే బిజినెస్ పనిచేసే వేళల్లో మాత్రమే కస్టమర్ కంపెనీకి వచ్చి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో వెబ్ సైట్ ఉండటం వలన కస్టమర్ కు కావాల్సిన టైం లో ఎక్కడ నుండైనా సమాచారం  ఆన్ లైన్ లో చూసుకుంటాడు కనుక , బిజినెస్ మార్కెటింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది.
  • e-commerce లాంటి వెబ్ సైటు ల వలన కస్టమర్ కి తమకు ప్రొడక్ట్స్ ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇచ్చే సదుపాయం వుండటం వలన సమయం , డబ్బు రెండూ ఆధా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
  • బిజినెస్ కు వెబ్ సైట్ లేకపోవడం వలన బిజినెస్ అభివృద్ది లో మంచి అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది.
  • వెబ్ సైటు ఉండటం వలన ఆన్ లైన్ మార్కెటింగ్ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు.

మీరు సెలవు లో ఉన్నా , నిద్రపోతున్నా , వేరే పనిలో బిజీ గా ఉన్నా మీ కంపెనీ వెబ్ సైట్ ఆన్ లైన్ లో ఎప్పుడూ మీ బిజినెస్ ని 24 X 7 మార్కెట్ చేస్తూ ఉండటమే కాకుండా , మీ ప్రోడుక్టలను లను ఒకే దగ్గర ప్రమోట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ , మీ బిజినెస్ బ్రాండ్ ని పెంచుతూ , మీ బిజినెస్ అభివృద్దికి ఎల్లప్పుడు సహాయపడుతూ ఉంటుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు.

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment