Missed కాల్ ద్వారా బ్యాంకు ఖాతాలో Balance తెలుసుకోండి

బ్యాంకు అకౌంట్ లో Balance ఎంత వుందో తెలుసుకోవడానికి బ్యాంకు లేదా  ATM లేదా దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా , ఇంటిదగ్గర నుండే మొబైల్ నుండి ఒక missed call ఇవ్వడం ద్వారా చాలా సులువుగా తెలుసుకోవచ్చు . ఈ సదుపాయం వినియోగించుకోవాలంటే మీ బ్యాంకు అకౌంట్ కు మీ మొబైల్ తప్పనిసరిగా లింక్ అయివుండాలి . లేదంటే బ్యాంకు కు వెళ్లి ఎకౌంటు నెంబర్ తో ఫోన్ నెంబర్ ను లింక్ చేసుకోవలసి ఉంటుంది.

ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్ ల ద్వారా ఏ బ్యాంకు లో మీ అకౌంట్ వుందో , ఆ నెంబర్ కి Missed కాల్ ఇవ్వడం ద్వారా అకౌంట్ లో ఎంత Balance వుందో తెలుసుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ : ఐసీఐసీఐ వినియోగదారులు ఖాతాలోని నగదు నిల్వను తెలుసుకోవాలంటే 02230256767కు కాల్ చేయాలి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : మీ ఖాతాలోని నగదు నిల్వను తెలుసుకునేందుకు 09223008586కు మిస్డకాల్ ఇవ్వాలి.

ఆంధ్రా బ్యాంక్ : ఆంధ్రా బ్యాంక్ ఖాతాదార్లు 09223011300 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా నగదు నిల్వను తెలుసుకోవచ్చు.

హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ :హెచ్డీఏసీ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా కింది సౌకర్యాలు ఉన్నాయి. ఖాతాలోని నగదు నిల్వను తెలసుకునేందుకు 18002703333కు కాల్ చేయాలి మినీ స్టేటమెంట్ కోసం 18002703355కు కాల్ చేయాలి చెక్కు పుస్తకం అభ్యర్థన కోసం 18002703366కు కాల్ చేయాలి అకౌంట్ స్టేట్ మెంట్ కోసం 18002703377కు కాల్ చేయాలి

బ్యాంక్ ఆఫ్ బరోడా : ఖాతాలో నగదు నిల్వను తెలుసుకునేందుకు 8468 00 1111మిస్డ్ కాల్ ఇవ్వాలి మినీ స్టేటిమెంట్ కోసం 8468 00 1122 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలి

కార్పొరేషన్ బ్యాంక్ : కార్పొరేషన్ బ్యాంక్ దేశంలో ఉండే వినియోగదారులు ఖాతాలో నగదు నిల్వ తెలుసుకోవాలంటే 09268892688కు కాల్ చేయాలి విదేశాల్లో ఉండే వినియోగదారులు ఖాతాలో నగదు నిల్వ తెలుసుకోవాలంటే – 919268892688కు కాల్ చేయాలి

ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ : బ్యాంకు వద్ద నమోదయిన మొబైల్ నంబరు నుంచి 04442220004కు కాల్ చేయాలి.

విజయా బ్యాంక్: నగదు నిల్వను తెలసుకునేందుకు 1800 103 5525 మినీ స్టేట్ మెంట్ కోసం 1800 103 5535

యూకో బ్యాంక్ : యూకో బ్యాంక్ ఖాతాలోని నగదు విచారణ కోసం 092787 92787 నంబరుకు కాల్ చేయాలి.

యాక్సిస్ బ్యాంక్ : 1800 419 5959 నంబరుకు కాల్ చేయడం ద్వారా ఖాతాలో ఉన్న నగదు వివరాలను తెలుసుకోవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 1800 180 2222 / 1800 103 నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సంక్షిప్త సందేశంలో నగదు నిల్వను తెలుసుకోవచ్చు.

ఐడీబీఐ బ్యాంక్ : 09212993399కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా BAL అని మెసేజ్ పంపడం ద్వారా ఖాతాలోని నగదు నిల్వను తెలుసుకోవచ్చు.

దేనా బ్యాంక్ : 09289356677కు కాల్ చేసి సంక్షిప్త సందేశ రూపంలో ఖాతాలోని నగదు ఎంతుందో తెలుసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా : బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదార్లు 09015135135/ 09266135135 మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతా నగదు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

సౌత్ ఇండియన్ బ్యాంక్ : 09223008488కు కాల్ చేయాలి. ఇండియన్ బ్యాంక్ ఖాతా నగదు నిల్వను తెలుసుకునేందుకు 092895-92895కు కాల్ చేయాలి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : గత మూడు లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్ మెంట్ కోసం 09555144441కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఖాతా నగదు విచారణ కోసం 09555244442 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

సిండికేట్ బ్యాంక్ : మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ అయ్యేందుకు SREG స్పేస్ కస్టమర్ ఐడీని 09241442255కు పంపాలి. నమోదయిన వినియోగదారులు 09241442255 లేదా 08067006979 నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా నగదు నిల్వను తెలుసుకోవచ్చు

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ : నగదు విచారణ కోసం ACBALAccountnumber” అని 09915622622కు సందేశాన్ని పంపాలి. మినీ స్టేటమెంట్ కోసం “STMAccountnumber” అని 09915622622కు సందేశాన్ని పంపాలి.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : ఖాతా నగదు నిల్వను తెలుసుకునేందుకు 09015431345కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

యెస్ బ్యాంక్ : 09223920000కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతాలో నగదు ఎంతుందో తెలుసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు , సందేహాలు క్రింద కామెంట్ చేయండి

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment