బిజినెస్ చేసేవారు చేసే తప్పులేంటి ? అవి ఎలా సరి దిద్దుకోవాలి ?

బిజినెస్ చేసేవారు సాధారణం గా చేసే తప్పులేంటి ? అవి ఎలా సరి దిద్దుకోవాలి ?

కొత్తగా బిజినెస్ అంటే అంత చిన్న విషయం కాదు. బిజినెస్ స్టార్ట్ చేసే వారు చాలా  వరకు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేయడం సహజం , ఆ తప్పులు ఏంటో తెలుసుకొని, సరిదిద్దు కొని ముందుకు సాగిపోవడం అనేది బిజినెస్ చేసేవారికి చాల అవసరం. ఒకసారి తప్పు చేసి అది తెలుసుకోకుండా తప్పుమీద తప్పు చేస్తుంటే , బిజినెస్ లో సక్సెస్ అందుకోవడం చాలా కష్టం. బిజినెస్ ని విజయవంతంగా నడపాలంటే క్రింద చెప్పబడినవి చేయకుండా ఉండాలి.

Simple గా చెప్పాలంటే….

  • నమ్మకమయిన భాగస్వామిని యెంచుకోక పోవడం
  • మార్కెటింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం
  • అనుకొన్న సమయానికి బిజినెస్ ప్రారంభించక పోవడం
  • బిజినెస్ గురించి సరైన ప్రకటన ఇవ్వకపోవడం
  • కస్టమర్ ని పట్టించుకోక పోవడం

ఇంకా వివరంగా తెలియాలంటే ….

  • నాకు అన్ని విషయాలు తెలుసు అనే భావన రానివ్వకూడదు. Over Confidence అనేది ఉండకూడదు. మార్కెట్ లో పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. కొత్తగా వచ్చే మార్పులేంటో తెలుసుకుంటూ మార్కెటింగ్ అవసరాలకి అనుగుణంగా మన బిజినెస్ లో మార్పులు చేసుకుంటూ పోవాలి.
  • వ్యాపార భాగస్వామిని ఎంచుకోవడం లో కొంత తెలివిని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న బిజినెస్ లకు అయితే భాగస్వామి అవసరం ఉండదు. కానీ పెద్ద వ్యాపారాలకు మీరు ఎంచుకునే భాగస్వామి మీ ఆలోచన లకు అనుగుణంగా , మీ నిర్ణయాలను గౌరవించే వారుగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలలో తప్పొప్పులను నిజాయితీగా పంచుకునే వారిని ఎంచుకోండి.
  • బిజినెస్ ని పెంచుకోవడం కోసం ప్రోడక్ట్ క్వాలిటీ నీ పట్టించుకోకపోవడం లాంటివి చేయొద్దు. క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్స్ కి అందించడం పైన కూడా దృష్టి పెట్టాలి.
  • చాలామంది చేసే పెద్ద Mistake , తమ కస్టమర్ కి ఓపికతో సరైన సమాధానం ఇవ్వకపోవడం, ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు.  
  • బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకోవడం లో టెక్నాలజీ పాత్ర ఎంత ఉందో గుర్తించకపోవడం. టెక్నాలజీ ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
  • మీ వలన ఏమైనా పొరపాటులు జరుగుతుంటే , మీ బిజినెస్ భాగస్వాముల తో ఎప్పటికప్పుడు చెప్పడం మంచిది.
  • బిజినెస్ పరంగా మీ శత్రువులు వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ competitor మీరు చేసే తప్పులకోసం ఎదురు చూస్తూ ఉంటారు . చిన్న తప్పులే కొన్ని సమయాల్లో competitor కి అదనుగా మారవచ్చు. అలాంటి తప్పులకు జరగకుండా చూసుకోవాలి.
  • ఆర్ధిక పరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. బిజినెస్ లో ఫైనాన్స్ సంబంధిత విషయాలలో తప్పు చేస్తే మీ వ్యాపారం పేకమేడలా కూలిపోతుంది. మీకు ఫైనాన్స్ సంబంధిత విషయాలలో అవగాహన తక్కువ ఉంటే , ఒక మంచి Finance Adviser ని నియమించింది సలహాలు పొందడం ఎంతో మంచిది.
  • బిజినెస్ ప్లాన్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఎప్పుడు ప్రారంభిస్తే మంచిదో తెలుసుకొని , సరైన సమయం లో బిజినెస్ ప్రారంబించాలి.
  • సరైన ప్లాన్ లేకుండా బిజినెస్ ని విస్తరించకూడదు, ఎక్కడ విస్తరించాలో, ఆయా ప్రాంతాలలో బిజినెస్ కి అనుకూలంగా ఉందా ? లేదా ? అని ప్లాన్ చేసుకొని చేయాలి.
  • వ్యాపార లావాదేవీలు సరిగా ఉండేలా చూసుకోవాలి. డబ్బు చేతిలో వుందని అవసరం లేకున్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మంచిదికాదు.
  • కస్టమర్ లకు క్వాలిటీ ప్రోడక్ట్ ల గురించి వివరించి , Advertisement ల ద్వారా Attract చేయడం లాంటివి చేయాలి . దానికోసం వారితో మంచి కమ్యూనికేషన్ Maintain చేయడం ఎంతో ముఖ్యం.
  • ఈ రోజు సాధించిన విజయాన్ని చూసి తృప్తి పడటం కాదు , కొత్త విషయాలను తెలుసుకుంటూ భవిష్యత్తులో చేయబోయే బిజినెస్ అభివృద్ధి కొత్త ఆలోచనలు చేసుకుంటూ … మీ బిజినెస్ ని అభివృద్ధి పథంలో నడపడం అలవరచుకోవాలి.  
ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు , సందేహాలు క్రింద కామెంట్ చేయండి

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment