మీ Startup బిజినెస్ కోసం మంచి బ్రాండ్ నేమ్ కావాలా ?

Startup business ప్రారంభిస్తున్నవారికి ముందుగా ఎదురయ్యే ప్రశ్న “బిజినెస్ ఏ పేరు తో ప్రారంభించాలి? “ కొంత మందికి ఇది చాలా చిన్న విషయం , కొందరికి ఇదే కొండంత సమస్యలా ఉంటుంది. మీరు రెండో క్యాటగిరి లో ఉంటే , ఈ సమస్యకి పరిష్కారం ఇంటర్నెట్ లోనే దొరుకుతుంది. ఎలా అంటారా ? దీనికోసం ఆన్‌లైన్ లో ఎన్నో వెబ్ సైట్ లు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయి.

ఆన్‌లైన్ లో దొరికే ఈ వెబ్ సైట్ లను ఉపయోగించుకొని , మీరు క్రియేటివ్ గా ఆలోచించుకొని, మీ బిజినెస్ కోసం మంచి పేరు ని సృష్టించుకోవచ్చు . బిజినెస్ కు నేమ్ ఎంచుకోవడం అనేది బిజినెస్ బ్రాండింగ్ లో ఒక భాగం. బిజినెస్ కోసం పేరు ఎంచుకునేవారు ముఖ్యం గా కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.

అవేంటంటే …

 • ఎంచుకునే పేరు బిజినెస్ ప్రతిబింబించేలా ఉండాలి.
 • బిజినెస్ పేరు కస్టమర్ కు సులువుగా గుర్తుండిపోయేలా , కస్టమర్ లను ఆకట్టుకునేలా ఉండాలి.
 • మరొకరు ఉపయోగిస్తున్న బిజినెస్ పేరు కాపీ లా ఉండకూడదు ( కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ).
 • బిజినెస్ పేరు చిన్న దిగా అర్థవంతంగా ఉంటే మంచిది (Short and Sweet ).
 • బిజినెస్ పేరు మార్కెటింగ్ చేయడానికి సులువుగా , ఎక్కడ కనిపించినా సులువుగ మీ బిజినెస్ ని గుర్తుకు తేగలిగే విధంగా ఉండాలి. 
 • బిజినెస్ పేరు అనేది, చేయబోయే పనికి లాభం చేకూర్చే విధంగా ఉండాలి.
 • Logo డిజైన్ కు వీలుగా ఉండాలి. 

   క్రింద ఇవ్వబడిన వెబ్ సైటు లను ఉపయోగించుకొని బిజినెస్ కు కావలసిన పేరు కోసం సూచనలు పొందవచ్చు. ఈ వెబ్ సైటు లు చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు . ఈ వెబ్ సైటు లలో మన బిజినెస్ కు తగినట్లు keywords ఇవ్వాలి ( ex : గిఫ్ట్ షాప్ బిజినెస్ అయితే , Gift,Shop) keywords ఉపయోగించుకొని కొన్ని Names Create చేయబడుతాయి.Names లలో మనకు నచ్చిన పేరు ఉపయోగించుకోవచ్చు లేదా మరో మంచి keywords ద్వారా కొత్త లిస్టు create చేసుకోవచ్చు.    

Biznamewiz ఉపయోగించుకొని చాలా సులువుగా మనకు కావలసిన బిజినెస్ నేమ్ ఎంచుకోవచ్చు. అంతేకాదు వెబ్ సైట్ కోసం కూడా కావలసిన పేరు అందుబాటులో ఉందా ? లేదా ? అనేది కూడా తెలుసుకోవచ్చు . ఈ వెబ్సైటు లో ఉన్న ఒకటి లేదా రెండు Key Words బిజినెస్ కి సంబంధించిన ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన Key Words కి కొన్ని అదనపు words కలిపి Business Names Generate చేసి వందకు పైగా Business Names మనకు అందజేస్తుంది.

shopify కూడా ఇదేవిధంగా Business Name Suggest చేసేందుకు డిజైన్ చేయబడింది. దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో కూడా బిజినెస్ నేమ్ keywords ఎంటర్ చేయాలి. దీనిలో 100 వరకు Business Names మనకు అందజేస్తుంది.

Leandomainsearch కూడా చాలా మంచి Free Business Name suggest చేసేందుకు ఆన్ లైన్ లో దొరికే ఒక మంచి వెబ్ సైట్. దీనిని ఉపయోగించి కూడా బిజినెస్ కు సంబంధించిన వెబ్ సైట్ పేరు కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. 

Comments

mood_bad
 • No comments yet.
 • chat
  Add a comment