కంపెనీ బ్రాండ్ కోసం మీకు కావలసిన నేమ్ ఉందో లేదో తెలుసుకొండిలా

Startup కంపెనీ లు ప్రతిరోజూ పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యల్లో కంపెనీ కి పేరు సెలెక్ట్ చేసేదానిలో కూడా ఎదురవుతుంది. అనుకున్న పేరు ఇది వరకే ఎవరో ఒకరు రిజిస్టర్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కంపెనీ కి మనం అనుకున్న పేరు అందుబాటులో ఉందా ? లేదా ? అనేది ఎలా చెక్ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మనం చేయబోయే బిజినెస్ కి గుర్తింపు , కంపెనీ పేరు ద్వారా ఉంటుంది. బిజినెస్ పేరు అనేది బ్రాండింగ్ లో ఒక భాగం. బ్రాండింగ్ అంటే ఏంటి ? ఎందుకు అవసరం అనే విషయాలు తెలుసుకోవాలంటే క్రింద లింక్ క్లిక్ చేయండి.

కంపెనీ కోసం పేరు ఎలా ఉండాలి ?

  • కంపెనీ కోసం పేరు అనేది ఇదివరకే మరెవరు ఎంచుకోని పేరుగా ( Unique Name ) ఉండాలి
  • వేరొకరి పేరు కాపీ చేయకూడదు .కాపీ హక్కుల చట్టం ద్వారా వారు కేసు పెట్టే అవకాశం ఉంటుంది
  • బిజినెస్ కోసం ఎంచుకునే పేరు , మీ బిజినెస్ ప్రొడక్ట్స్ ని , మీరు అందించబోయే క్వాలిటీ ని ప్రతిబింబిస్తూ ఉంటే మంచిది
  • కంపెనీ పేరు కస్టమర్ లకు సులువుగా గుర్తుండిపోయే లా ఉండాలి
  • మీరు ఎంచుకోబోయే పేరు , లీక్ కాకుండా … బ్రాండింగ్ సంబంధించిన పనులన్నీ పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచుకోవడం మంచిది.

కంపెనీ కోసం పేరు అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ?        

      కంపెనీ కోసం పేరు అందుబాటులో వుండేది లేనిది చాలా సులువుగా తెలుసుకోవచ్చు. Parnership బిజినెస్ కోసం అయినా , LLP,PVT Ltd కంపెనీ అయినా search చేసుకునే విధానం ఒకేలా ఉంటుంది. ఇదే విధానం ద్వారా కంపెనీ రిజిస్టర్ అయివుందా లేదా Fake కంపెనీ అన్న విషయాలు తెలుసుకోవచ్చు.

అనుకున్న పేరు ఇదివరకే ఎవరైనా రిజిస్టర్ చేసి వుంటే … వివరాలు చూడవచ్చు.

  • Activity Type దగ్గర కంపెనీ బిజినెస్ టైపు ఎంటర్ చేసి Search బటన్ పైన క్లిక్ చేయాలి

   క్రింది ఇమేజ్ లో చూడవచ్చు. Status Allocated / Approved అని ఉంటే రిజిస్టర్ చేయబడిన కంపనీలు, Reserved అని ఉంటే కంపనీ ఇంకా రిజిస్టర్ కాలేదు, వేరొకరు Reserve చేసుకొన్నారు అని తెలుసుకోవచ్చు.అలా కాకుండా error box వస్తే మీరు అనుకొన్న నేమ్ ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు.ఆ నేమ్ ని మీ కంపెనీ నేమ్ కోసం apply చేసుకోవచ్చు.  

తర్వాతి ఆర్టికల్స్ లో కంపెనీ నేమ్ కోసం ఎలాంటి రూల్స్ పాటించాలి? Trademark అంటే ఏంటి ? Trademark check చేసుకొని ఎలా apply చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.          

ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు , సందేహాలు క్రింద కామెంట్ చేయండి

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment