Startup బిజినెస్ కోసం రిజిస్ట్రేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ?

మీరు ఒక బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే , రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకోవాలి . అది చిన్న కంపెనీ అయినా సరే, పెద్ద కంపెనీ అయినా సరే రిజిస్ట్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ కి చాలా ఖర్చు అవుతుందేమో అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ప్రారంభించే బిజినెస్ కు తగినట్లు మనకు వివిధ రకాల రిజిస్ట్రేషన్ లు ఉన్నాయి. ఏ రిజిస్ట్రేషన్ మనం చేయబోయే కంపెనీ కి సరిపడుతుందో తెలుసుకొని దానికి తగినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది.

ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి ? దాని వలన ఉపయోగాలేంటి ?   

కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా ఉపయోగాలే వున్నాయండి. అవేంటంటే …

  • కంపెనీ రిజిస్ట్రేషన్ వలన కంపనీ కి బ్రాండ్ value అనేది ఉంటుంది. కస్టమర్ లకి మీ ప్రోడక్ట్ ల పైన నమ్మకం కుదురుతుంది.
  • రిజిస్ట్రేషన్ చేయించడం వలన బ్యాంకు ల నుండి రుణాలు త్వరగా వచ్చేదానికి వీలు ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ చేయించడం వలన కంపెనీ కి బయట నుండి నమ్మకం గా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • కంపెనీ కి అయ్యే ఖర్చులు, రాబడుల విషయాల్లో పారదర్శకత ఉంటుంది.
  • గవర్నమెంట్ కి కట్టవలసిన టాక్స్ లు , Returns లు సవ్యం గా జరుపుకునే అవకాశం కల్పిస్తుంది. తద్వారా Penalty లు Fine లు లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి.
  • కంపెనీ కి షేర్ లు రాబట్టుకోవాలన్నా , కంపెనీ ని షేర్ మార్కెట్ లో List చేయాలన్నా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి.
  • లీగల్ గా కంపెనీకి కావలసిన సెక్యూరిటీ చేకూరుతుంది.
  • కొన్ని రకాలయిన రిజిస్ట్రేషన్ పద్దతుల ద్వారా.. నష్టాలు వస్తే ,కంపెనీ కి సంబంధం లేని మీ సొంత ఆస్తులను కాపాడుకునే వీలు ఉంటుంది.

ఎన్ని రకాలయిన రిజిస్ట్రేషన్ పద్దతులు ఉన్నాయి?      

చేయబోయే బిజినెస్ కు అనుగుణంగా ఏ రిజిస్ట్రేషన్ సరిపోతుంది అనేది చూసుకొని చేయించుకోవాలి. కంపెనీకి private ltd ఉంటేనే బావుంటుంది, కంపనీ కి విలువ ఎక్కువగా ఉంటుంది ఇలా ఆలోచన చేస్తూ … అవసరం లేకపోయినా అలాంటి రిజిస్ట్రేషన్ చేయించడం వలన డబ్బు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా నష్టపోకుండా , రిజిస్ట్రేషన్ పద్దతులు తెలుసుకొని , ఏది సరిపోతుంది అనేది తెలుసుకొని చేయడం మంచిది.రిజిస్ట్రేషన్ కోసం అనేక పద్ధతులున్నాయి … అవేంటంటే …

Sole Proprietorship: ఒక వ్యక్తి తన సొంత పేరుతోనే బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలంటే Sole Proprietorship ని ఎంచుకోవచ్చు. Sole Proprietorship కు కంపెనీ కి ఉన్న విలువ ఉండదు. దీనిలో బిజినెస్ సంబంధించిన ఆస్తులు , సొంత ఆస్తులు అనేది విడిగా ఉండవు. ఒక వేళ నష్టాలు వచ్చినా పర్సనల్ ఆస్తులకు కూడా నష్టం జరుగుతుంది. ఇది కేవలం Tax లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంటిదగ్గరే ఉంటూ చిన్న బిజినెస్ లు చేసుకొనే వారికి ఇది ఉపయోగం గా ఉంటుంది.

Partnershipఇది కూడా Proprietorship మాదిరిగా ఉంటుంది. Proprietorship వున్నట్లు రూల్స్ ఉంటాయి.  కానీ దీనిలో వున్న తేడా ఏంటంటే, ఒకరికన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటూ , చిన్న బిజినెస్ ప్రారంభించాలి అనుకున్న వారికి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా ఒక కంపెనీ లా పరిగణించ బడదు. ఎవరికి ఏ వర్క్ ఉంటుంది? ఎంత భాగం లాభాల్లో వాటా , ఇలాంటివి మాత్రమే దీనిలో ఉంటాయి. Proprietorship కు వున్న Tax ఉపయోగాలు Partnership కు ఉండవు.   

Limited Liability Partnership ( LLP ): ఈ కాన్సెప్ట్ ఇండియా లో 2009 లో ప్రారంభించబడింది. startup లకు చాలా మంచి ఆప్షన్ గా LLP ని పరిగణిస్తారు. ఇలా రిజిస్ట్రేషన్ అయిన బిజినెస్ ను కంపెనీ మాదిరిగా పరిగణిస్తారు. దీనిలో partnetship లో వున్న అంశాలు మరియు కంపెనీలకు సంబంధించిన అంశాలకు మధ్యలో ఉంటుంది. లీగల్ వ్యవహారాలు చాలా సులువుగా ఉంటాయి. బిజినెస్ లో ఏమైనా నష్టాలు వచ్చినా కూడా , personal property కి ఎలాంటి నష్టం ఉండదు. కంపెనీకి ఉన్న సెక్యూరిటీ అంశాలు అన్నీ LLP కి ఉంటాయి. Startup బిజినెస్ లకి Best రిజిస్ట్రేషన్ ఆప్షన్ LLP.

Private Limited: కంపెనీ కి కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. పైన వాటితో పోలిస్తే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. Startup కంపెనీ వారు భవిష్యత్ లో ఒక పెద్ద కంపెనీ గా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన Funding కోసం Private Limited బాగా ఉపయోగపడుతుంది. Private Limited వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. మార్కెట్ లో కంపనీ బ్రాండింగ్ కోసం కూడా Private Limited బాగా ఉపయోగపడుతుంది.బాంక్ లోన్స్ కి చాలా ఉపయోగకరంగా వుంటుంది. 

One Person Company (OPC):  Partners ఎవరూ అవసరం లేకుండా, ఒక్కరు మాత్రమే కంపెనీ రూపం లో బిజినెస్ ప్రారంభించాలి అనుకొంటే, ఈ OPC బాగా ఉపయోగపడుతుంది.

పైన చెప్పిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లు ఎలా చేయాలి ? ఏ డాకుమెంట్స్ అవసరం ? ఇలాంటి సమాచారం వివరణాత్మకం గా తర్వాతి ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.                    

ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు , సందేహాలు క్రింద కామెంట్ చేయండి

Comments

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment